పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్  ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం,   తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం వ్యవసాయ శాఖ అనుబంధంతో గీసుకొండ మండలంలో గంగదేవిపల్లి, మచ్చాపూర్ గ్రామాలలో పత్తి, వరి, సోయా,  పసుపు  కూరగాయ  పంటలలో రోగనిర్ధారణ కొసం వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు
ఈ సందర్భంగా  సీనియర్ శాస్త్రవేత్త  Dr. ఆర్.  శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ   పత్తి పంటలో  ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో  రసం పీల్చేచే పురుగుల నివారణకై  వేప నూనె (1500 PPM)  ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా  అసిఫేట్  ఎకరాకు 300 గ్రాములు చొప్పున లేదా ఫ్లునికామైడ్ 0.25 మీ. లీ. చూపిన 200 lit నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. మొక్కజొన్న లో  కత్తెర పురుగులు , ఆకు మాడు తెగులు గమనించడం జరిగింది.  కత్తెర పురుగు   నివారణకు  ఎమమెక్టిన్ బెంజోయేట్ మందు ఎకరాకు 80 గ్రా చొప్పున మొవ్విలో  పడే విధంగా పిచికారి చేసుకోవాలని అలాగే ఆకుమాడు తెగులు నివారణగా  ప్రాపికోనజోల్  అనే మందును  ఎకరాకి 200 ml  పిచికారి చేయాల్సిందిగా సూచించారు.
ఆలస్యంగా వరి సాగు చేసేవారు కలుపు యాజమాన్యం పై  జాగ్రత్త వహించాలని సూచించారు.  గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు   ఫినాక్సి ప్రాప్ ఈథైల్ (రైస్ స్టార్) అనే మందును  ఎకరాకి 350 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని  పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.   వెడల్పాటి  ఆకు కలుపు   తుంగ  నిర్మూలనకై  ట్రై ఫోమో  ఈత్ ఆక్సీ సల్ఫురాన్
( కౌన్సిల్ ఆక్టివ్)  మందును  ఎకరానికి 90 గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.
పసుపు పంట లో దుంప కుళ్ళు  దుంప పుచ్చు ఆశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దుంపకుళ్ళు నివారణకు మొక్క మొదట్లో వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకొని, మెటల్ ఆక్సిల్ మరియు మాoకోజెబ్  కలిగిన మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొదలు తడిచేలా పిచికారి చేసుకోవాలి. దుంప పుచ్చు ఆశించకుండా దుంప ఈగ నివారణకు కార్బో ఫ్యూరాన్ 3 సిజి గుళికలను ఎకరానా 8 నుంచి 10 కిలోలు ఇసుకలో కలుపుకొని పొలమంతటా జల్లుకోవాలి. పొటాష్ లోపం నివారణకు (13- 0- 45) 5 గ్రా లీటరు నీటికి కలుపుకొని ఆకుల పై పిచికారీ చేసుకోవాలి.ఈ కార్యక్రమంలోశాస్త్రవేత్తలు  రాజ్ కుమార్, సౌందర్య, మానసతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారిణి కావ్య అభ్యుదయ రైతులు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments