(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):
చిన్నారులకు తల్లి పాలు ఎంతో శ్రేష్ఠం అని వరంగల్ జిల్లా నర్సంపేటసీడీపీఓ మధురిమ, ఖానాపూర్ ఎంపీడీఓ వనపర్తి అద్వైత లు అన్నారు
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలోని అంగన్వాడీ సెంటర్ 2 టీచర్ తేజావత్ కవిత ఆధ్వర్యంలో జరిగిన తల్లిపాల వారోత్సవంలో ఖానాపూర్ ఎండిఓ వనపర్తి అద్వైత సిడిపిఓ మధురిమ బుధ వారం పాల్గొని మాట్లాడారు. శిశువులకు తల్లిపాలు 7 నెలల వరకు ఇవ్వవచ్చునని అన్నారు తల్లులు పోషక పదార్థాలను తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. ప్రతి సంవత్సరము ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయని అన్నారు.
అంగన్వాడి సూపర్వైజర్ రమ మాట్లాడుతూ గర్భిణీలు పోషక పదార్థాలు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి నాలుగవ భోజనం చేయాలని అన్నారు చిన్నపిల్లలను అంగన్వాడి సెంటర్ కు తీసుకొని వచ్చినప్పుడు వారికి మనో వికాసము జరుగుతుందని అన్నారు చిన్నపిల్లలకు అంగన్వాడీ లో ఆటపాటల ద్వారానే ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ అబోతు శ్రీలత,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు శిశువులకు సెల్ ఫోన్లు ఇవ్వవద్దని అన్నారు . దీని వల్ల రేడియేషన్తో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. సెల్ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రమీల, ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం పరోషిని మరో అంగన్వాడి టీచర్ భూక్యా కవిత, పాఠశాల ఉపాధ్యాయులు వాంకుడోత్ వాగ్య ,భూఖ్య వీరన్న తల్లులు, గర్భిణులు ,అంగన్వాడీ ఆయాలు ,ఆశ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.ఇంకా శిశువు కు అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు.
0 Comments