కసిత్ భారత్ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ఎంపిక!

 


జై భార‌త్ వాయిస్ హ‌న్మ‌కొండ‌

హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకుడు ఆర్. విఘ్నేష్ రాష్ట్ర స్థాయి 'నషా ముక్త యువ – వికసిత్ భారత్ 2026' కార్యక్రమానికి ఎంపికయ్యారు.కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్–హనుమకొండ నిర్వహించిన జిల్లా స్థాయి 'నషా ముక్త యువ – వికసిత్ భారత్ 2026' కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన ఆయన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. జ్యోతి తెలిపారు. త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. జ్యోతి విద్యార్థిని అభినందించి, రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్.ఎం. రెహమాన్, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాధికారులు  ఎస్. శ్రీదేవి,ఎన్. చందర్,  ఎ. రమేష్, ఎ. శ్రీలత విద్యార్థిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


Post a Comment

0 Comments