వరంగల్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడుగా వేణుగోపాల్

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
టీఎన్జీఓస్ యూనియన్ వరంగల్ జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం సోమవారం టీయన్జీఓస్ భవన్ లో జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా కేంద్ర సంఘ సహ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్  హజరయ్యారు రాంకిషన్ వరంగల్ జిల్లా అద్యక్షులు జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా ఏర్పడుతున్న జిల్లా అధ్యక్షులు ఖాళీనీ ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి గాజే వేణుగోపాల్ ను జిల్లా అధ్యక్షులుగా, అలాగే కార్యదర్శిగా పాలకుర్తి సదానందంను, కోశాధికారిగా కిరణ్ కుమార్ ను నియమించినట్లు రామ్ కిషన్ తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షులు గాజ వేణుగోపాల్ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు, సంఘంలో 22 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పనిచేస్తూ ,ప్రస్తుతం టీఎన్జీఓ జిల్లా కార్యదర్శిగా, గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిగా, టీఎన్జీఓ వెటర్నరీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా, కోశాధికారిగా, సహాయ కార్యదర్శిగా అనేక పదవులు చేపట్టి సంఘం యొక్క అభ్యున్నతికి కృషి చేయడం వల్ల ఈ పదవి లభించడం జరిగింది. 
ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ తనపై  నమ్మకం తో అధ్యక్షులుగా నియమించిన కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్ కి ,ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ కి ,సహాధ్యక్షులు సత్యనారాయణగౌడ్ కి , సహకరించిన వరంగల్ జిల్లా అధ్యక్షులు రామ్ కిషన్ కి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ కి,కేంద్ర సంఘ నాయకులు రామునాయక్ కి,వేముల వెంకటేశ్వర్లుకి, ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సంఘ శ్రేయస్సు కోసం పాటుపడుతూ, జిల్లా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంగా సంఘం బాధ్యులతో కలిసి కృషి చేస్తానని వారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాలకుర్తి సదానందం కోశాధికారి కిరణ్ కుమార్, వరంగల్ పట్టణం అధ్యక్షులు శంకేసి రాజేష్, జిల్లా కార్యవర్గం సభ్యులు వంశీధర్ బాబు, గద్దల రాజు, రమాదేవి, ఇంద్రాసేనరెడ్డి, రజినీకాంత్,శరత్, రామకృష్ణ, గణేష్, యూసఫ్, శ్రీజ్యోతి,సునీతా, పద్మ, కవిత,నాయర్, తాలుకా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments