నీరు కుళ్ళ లో అంగ రంగ వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.మేళ తాళాలతో వేద బ్రాహ్మణులతో భజన భక్తుల పాటలతో, భక్తుల కోలాహాలం తో, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.ఈ సందర్భంగా వేద పండితులు  వేణుగోపాలస్వామి,  బాబు, వద్దేవరం సాయి చరణ్ వేద మంత్రోచ్ఛారణల తో కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు.స్వామి కళ్యాణం అనంతరం దేవాలయ ప్రధాన పూజారి అయిన వద్దేవరం వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిధి సొసైటి మాజీ చైర్మన్ కడారి రఘునాథ రావు, నీరుకుల్ల గ్రామ సర్పంచ్ తడక నీరజ శ్రీనివాస్,ఆలయ కమిటీ చైర్మన్ జలగం నర్సింగరావు, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ పుల్లూరు బుచ్చన్న, చెన్న కేశవ్ స్వామి ఆలయ చైర్మన్ తాటిపర్తి మోహన్ రావు , సిద్ధలింగ ఆలయ చైర్మన్ ఎన్నపురెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీ టీ సి,మానగాని శంకర్, సూరం రాధ,అంకతి రాజ్ కుమార్, కాగితపు రాజు,పెనుగొండ కైలాసం,తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments