బీజేపీ ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది
 ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పడిన రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, రైతులు, యువత, మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని పేర్కొన్నారు.ఉద్యమకారుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది హామీలు అమలులో ఆలస్యం జరిగితే భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించడం జరిగింది*
కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గట్టు వేణుగౌడ్, ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల రవి,మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, మండల ప్రధాన కార్యదర్శి రవ్వ శివప్రసాద్, బిజెవైఎం మండల అధ్యక్షులు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, మండల కోశాధికారి జక్కుల మహేందర్, కార్యదర్శి వజ్ర రవికుమార్, బూత్ అధ్యక్షులు మాచర్ల స్వామి, అల్లి మహేందర్ లకిడీ నాగరాజు నకినబోయిన రమేష్ బత్తిన రాజశేఖర్, పిట్టలస్వామి, కొలగని సుధాకర్, ఉకంటి శ్రీనివాస్ రెడ్డి, వెలదే అయోధ్య కైలాసపతి, శ్రీకాంత్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments