(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ గీసుకొండ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు *కొంగర రవికుమార్* జాతీయ జెండాను ఆవిష్కరించినా అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అమరుల ఆత్మ బలిదానాలు, సబ్బండ వర్గాల పోరాటం తో పాటు,ఆనాడుపార్లమెంట్‌లో బీజేపీ మద్దతు – సుష్మా స్వరాజ్ గారి చొరవ మరవలేనిది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే దానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిరంతర మద్దతే కారణమని గుర్తుచేశారు. ఆనాడు పార్లమెంట్‌లో బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించబట్టే తెలంగాణ బిల్లు పాస్ అయిందని చెప్పారుతెలంగాణ సెంటిమెంట్‌తో రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం
"నీళ్లు, నిధులు, నియామకాలు" అనే నినాదంతో, ఆత్మగౌరవం కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో తొలిదశ నుండి మలిదశ వరకు వందలాది మంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను బలిదానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మరియు ఆయన కుటుంబం తెలంగాణ సెంటిమెంట్‌ను కేవలం తమ స్వార్థం కోసం వాడుకుందని ధ్వజమెత్తారు. అమరవీరుల త్యాగాలను పక్కనబెట్టి, కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకుంటూ వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని, పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేశారని ,
బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని 'ఆరు గ్యారెంటీలు' అనే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, నేడు ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వమే శ్రీరామరక్ష అనీ అన్నారు.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది అని స్పష్టం చేశారు. కాకతీయ మేఘ టెక్స్టైల్ పార్క్ ను PM మిత్ర లో చేర్చి 1700 కోట్ల నిధుల కేటాయింపు,జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, ఎయిమ్స్, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వంటి ఎన్నో నిధులను, ప్రాజెక్టులను కేంద్రం తెలంగాణకు కేటాయించిందని వివరించారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే నిజమైన ఆత్మగౌరవం
తెలంగాణ ప్రజలు కోరుకున్న అసలైన నీళ్లు, నిధులు, నియామకాలు మరియు ఆత్మగౌరవం సిద్ధించాలంటే రాష్ట్రంలో కూడా బీజేపీ నేతృత్వంలోని "డబుల్ ఇంజన్ సర్కార్" రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు న్యాయం, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతాయని, తెలంగాణ ప్రజల కలలు సాకారమవుతాయని కొంగర రవి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లం కేదారి,బూత్ అధ్యక్షుడు కొంగర రంజిత్, బత్తిని వినయ్, కొంగర శరత్,పాషికంటి వెంకన్న,తాళ్ళపెల్లి రాజు, తండా దాసు, జులా వెంకన్న, అనుముల రాజు, తండా యాకస్వామి, పంజల శివ కొంగర అనిల్ , కొంగర అభిలాష్, అల్లం సుమన్, ధర చందు, అల్లం బిన్ను, రాకేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments