మోడల్ కాలనీ లో స్వచ్ఛంద శ్రమ దానం



(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా గుంతలో మోరం పోయించి
చదును  చేశారు ఆత్మకూరు మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మోడల్ కాలనీకి వెళ్లే రహదారీ పై గుంత ఏర్పడి రాక పోకల ఇబ్బందిగా తయారైంది.  నిత్యము వెళ్లడం వాహనాల  గుంతలో పడిపోవడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి ఈ క్రమంలో సంబంధిత అధికారులకు పలు మార్లు వివరించిన పట్టించుకోలేదు. ప్రధాన రహదారిని నిర్మాణం చేపట్టడంతో కాలనీకి వెళ్లే రోడ్డు కల్వర్టు పైభాగం సి సి వేశారు. పట్టించు కోలేదు  కాలువ కు రెండు వైపుల  గుంతగా ఏర్పడడంతో పాదచారులు సైతం అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో మోడల్ కాలనీ సంఘం అధ్యక్షుడు, పరపతి సంఘం డైరెక్టర్ పడాల భాస్కర్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా మొరం పోయించి చదను చేశారు   శ్రమదానంతో పూర్తి చేశారు ఈ పనిని చేయడం పట్ల మోడల్ కాలనీ వాసులు  హర్షం వ్యక్తం చేశారు


 

Post a Comment

0 Comments