(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):జాతీయ రహదారి అనుకుని ఉన్న టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితుడు ఎండి బాబు మియా ( చిరు ) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెప్పాడు సమీపంలోని 163 జాతీయ రహదారి పక్కన గల భద్రకాళి సామిల్ ఎండి బాబు మియా (చిరు) గత కొన్నేళ్లుగా లీజుకు తీసుకొని టింబర్ డిపోను నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి సుమారు పదిన్నర ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ మీటర్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు లేచి టింబర్ డిపో లో కట్ చేసి పెట్టిన చెక్కలు దుంగలు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని బాబుమియా తెలిపారు. అగ్ని ప్రమాద సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారని అన్నారు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం మూలంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఆస్తి నష్టం జరిగిందని తమకు నష్టపరిహారం చెల్లించాలని తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేశారు. కాగా ఈ సంఘటనను మాజీ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సందర్శించి బాధితుడు బాబు మీయా ని సోమవారం పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

0 Comments