పర్యావరణ అవగాహన ర్యాలీ

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ, ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, హనుమకొండ జిల్లా  NGC కోఆర్డినేటర్ లు సంయుక్తంగా కళాశాలల విద్యార్థులతో కలసి పర్యావరణ పరిరక్షణ కోసం  ప్లాస్టిక్ ను  పారేయకూడదు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు.పర్యావరణ కాలుష్యం ద్వారా ఏర్పడే దుష్పరిణామాలను నివారించడంలో భాగస్వాములు కావాలని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ శాస్త్రవేత్త  బి.జీముత వాహన పిలుపునిచ్చారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్  జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి మాట్లాడుతూ గ్రామీణ  పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్ధాల యాజమాన్యాన్ని పటిష్టంగా నిర్వహించడంతోపాటు ఏకవీనియోగ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు,  గాజు, స్టీల్ బాటిల్స్ ,విస్తర్లు మొదలగు సహజ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది,  150 మంది విద్యార్థులు లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments