యోగతో మానసిక ప్రశాంతత

 

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ

నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు. హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ అన్నారు. హన్మకొండ జిల్లా యోగ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం బుధవారం నాడు హన్మకొండ లో జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరిశీలకులుగా  ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు. హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, హనుమకొండ జిల్లా యువజన సంక్షేమ క్రీడా అధికారిక సంస్థ పరిశీలకులు నవీన్ ,తెలంగాణ యోగ అసోసియేషన్ రాష్ట్ర పరిశీలకులు బొలిశెట్టి కమలాకర్, ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాకాల రవీందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. యోగ అసోసియేషన్ కి ఒలంపిక్ అసోసియేషన్ నుండి అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యోగా పట్టణ ప్రాంతానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. హనుమకొండ జిల్లా యువజన సంక్షేమ క్రీడా అధికారిక సంస్థ పరిశీలకులు నవీన్ మాట్లాడుతూ డివై ఏస్ఎ నుంచి అన్ని రకాల సూచనలు అందిస్తామని అన్నారు. తెలంగాణ యోగ అసోసియేషన్ రాష్ట్ర పరిశీలకులు బొలిశెట్టి కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాలలో యోగ పై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు అనంతరం హనుమకొండ జిల్లా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 హనుమకొండ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులుగా బాల్నే శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా గుగులోతు కమల కిషన్, కోశాధికారిగా సూరం రాము,. ఉపాధ్యక్షులుగా పెరుమాండ్ల కిరణ్, కుండె కిరణ్, భైరబోయిన నిహారిక, సహాయ కార్యదర్శిగా గుగులోతు కిషన్, బండి మానస, కార్యవర్గ సభ్యులుగా బత్తిని స్పందన, కైలాష్, రామనాథంలు ఏకగ్రీవంగా ఎన్నికైనారు, ఈ సమావేశంలో లక్ష్మన్ ,వ్యాయామ ఉపాధ్యాయులు తీగల శ్రీనివాస్, పాషా వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ కొశాధికారి సాంబశివరావు,యోగా శిక్షకులు కొట రజిత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.









Post a Comment

0 Comments