ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యకారులకూ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉద్యమ కారుల కమిటీ జిల్లా కమిటీ కార్యదర్శి ఇర్సడ్ల సదానందం డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మకూరు మండల అధ్యక్షులు ఎండి బాబుమియా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇర్సడ్ల సదానందం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కేశవరావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో జీవో నెంబర్ 679 ప్రత్యేక కమిటీ వేయడం చాలా సంతోషం అన్నారు. ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు చెప్పారు
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం విధివిధానాలు తయారు చేయడం కోసం ఒక కాలపరిమితిని పెట్టాలని కోరారు. రెండున్నర సంవత్సరాల నుండి కాలయాపన చేసి ఇప్పుడు కమిటీ వేశారని చెప్పారు. కానీ కాల పరిమితి లేకుండా ఉద్యమకారులను మభ్యపెట్టడానికా అని అనుమానం వస్తుందనీ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసులు లేని వారు కూడా చాలామంది ఉన్నారని వారి ఫోటోలు పత్రిక ప్రకటనల వార్తల కటింగ్ల ను కూడా పరిగణలోకి అవకాశం ఇవ్వాలని కోరారు. జూన్ రెండో తారీకు లోపు కాలపరిమితిని పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి బాబుమియా, మండల ప్రధాన కార్యదర్శి దువ్వ రాజయ్య గ్రామ అధ్యక్షులు బలబద్ర కిషోర్ ,మంద రవి, భాష బోయిన సదానందం, సుధాకర్, వంగరి సమ్మయ్య, టేంకురాల రామారావు, నత్తి దేవేందర్, పెరుమళ్ళ స్వామి కుక్కల జంపయ్య, కరివేద సాంబ రెడ్డి, నాగేల్లి స్వామి, పెరుమళ్ళ ఇమాన్యుల్, పెరుమాండ్ల కొర్నెల్, వడ్డేపల్లి కోటయ్య, జాగిరపు లక్ష్మీనారాయణ, కరివేద సాంబారెడ్డి ,పాండవుల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు
0 Comments