నిరుపేద మహిళ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రానికి చాపర్తి లచ్చమ్మ అనే నిరుపేద మహిళ అనారోగ్యంతో మరణించారు. కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మృతురాలి కొడుకు మరణించగా భర్త కూడా వృద్దాప్యంలో ఉన్న వారి దయనీయ స్థితిని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ  మానవత్వంతో స్పందించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం  పంపగా, అట్టి నగదును మృతురాలి కుటుంబ సభ్యులకు గీసుకొండ సోషల్ సర్వీస్ టీం ప్రతినిధులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ  అందజేశారు. ఈకార్యక్రమంలో స్థానిక రజక సంఘం పెద్దలు చాపర్తి శ్రీను, సాంబయ్య, అనిల్, రాజమౌళి, వరుణ్,సింగారపు రాజు, చాపర్తి రాజగోపాల్, నవీన్, రాకేశ్, సూరిపల్లి మాజీ సర్పంచ్ గాదె భద్రయ్య  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments