నీరుకుల్ల శ్రీసిద్ధ లింగేశ్వర ఆలయానికి గ్రామస్తుల చేయూత

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుల్లా గ్రామంలో చేపడుతున్న శ్రీ సిద్ధ లింగేశ్వర ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు చేయూతన అందించారు .కాకతీయుల కాలంలో రాజులు పూజించిన శ్రీ సిద్ధ లింగేశ్వర స్వామి భూగర్భంలో ఉండగా గ్రామస్తులు గుర్తించి బయటికి తీసే గుడి నిర్మాణానికి చేపట్టారు అందులో భాగంగా దేవాలయ నిర్మాణానికి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు అలాగే  గ్రామానికి చెందిన సూరం  నారాయణరెడ్డి, రూ 5,00,116 రూపాయలు దేవాలయ నిర్మాణానికి భారీ విరాళం అందించారని నిర్మాణ కమిటీ చైర్మన్ వెన్నపురెడ్డి రాజిరెడ్డి, వైస్ చైర్మన్ పిట్టల ప్రభాకర్ లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ప్రముఖులు దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నా రని, ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతున్నదని తెలిపారు. సిద్ధులు కొలిచిన సిద్దలింగేశ్వర స్వామికి ప్రముఖ డాక్టర్ తుప్పరి నరసింహ స్వామి రూ.10116 రూపాయలు విరాళాలుగా అందించారని చెప్పారు దేవాలయ నిర్మాణంలో పాలు పంచు కోవాలనీ గ్రామస్తులకు పిలుపునిచ్చారు ఈసందర్భంగా విరాళాన్ని అందించిన దాత సురం నారాయణ రెడ్డి దంపతులను దేవాలయ కమిటీ ఆధ్వర్యం లో సత్కరించారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్ తడక నీరజ శ్రీనివాస్ శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ తాటిపర్తి మోహన్ రావు, అంకతి రాజుకుమార్, దగ్గు సమ్మారావు, లక్కర్సు రాజశేఖర్, లొల్లాటి రాజు దండి కుమార్ తదితరు లు పాల్గొన్నారు

Post a Comment

0 Comments