ఆత్మకూరు లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
 ఆత్మకూరు మండల కేంద్రం లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. గ్రామంలో శోభ భక్తి భావం వెల్లివిరిసింది. భక్తుల జయజయధ్వానాలతో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. పూజారి రమేష్ ఆధ్వర్యంలో  వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రేణుక ఎల్లమ్మ, కంఠమహేశ్వర స్వామి, జమదగ్ని మహర్షి, సురమాంబ, పోతరాజు విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది.
ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ దేవతా విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించారు.
ఈ సందర్భంగా భక్తులు “హర హర మహాదేవ శంభో శంకర… జై రేణుక ఎల్లమ్మ… జై జై రేణుక ఎల్లమ్మ” అంటూ భక్తి నినాదాలలు చేశారు మహిళలు బోనాలు, పూజా సామగ్రితో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, వార్డ్ మెంబర్ తనుగుల సందీప్, ఆలయ కమిటీ నిర్మాణం బృందం పొగాకుల కొమురయ్య, పొగాకుల రమేష్, గుర్రం ప్రభాకర్, వల్లాల రాజు, ఏరుకొండ పైడి, బూర మహేందర్, భారీ సంఖ్యలో మహిళలు, గౌడ కులస్తులు, గ్రామస్తులు పాల్గొని రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

Post a Comment

0 Comments