పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల్లో ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న పర్యావరణ కాలుష్యంపై అవగాహన పెంపొందించేందుకు గుడ్డతో తయారుచేసిన సంచులను పంపిణీ చేసినట్లు ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం భూమి, జల వనరులు, జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన గుడ్డ సంచులను వినియోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీలత, డాక్టర్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని గుడ్డ సంచుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
0 Comments