జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
వరంగల్ నగరంలోని పబ్లిక్ గార్డెన్ నేరెళ్ళ వేణుమాధవ్ ప్రాంగణంలో గ్రామ భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ఉత్పత్తుల సేంద్రియ పంటల సంతను ఘనంగా ప్రారంభించారు. మినిట్స్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వల చేసి ఈ సంతకు శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాల ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది.రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని శ్రీనివాస్ అన్నారు.ఈ నేపథ్యంలో గ్రామీణ రైతులకు మద్దతు కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా విక్రయిదారులు పాల్గొనటం అభినందనీయమని,
ఈరోజు మరియు రేపు జరిగే ఈ సంతలో సేంద్రియ కూరగాయలు, మిల్లెట్స్, గో ఆధారిత ఉత్పత్తులు లభ్యమవుతున్నాయని నిర్వాహకులు ఎక్కటి అజిత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్న సహజ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్రిమిసంహారక మందులు వాడకుండా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం కు చెందిన రైతు దంపతులు బానోతు విజయ్, అరుణ పండించిన అనేక రకాల కూరగాయలకు విశేష స్పందన లభించింది. వారు పండించిన సొరకాయ, కాకరకాయ, దోసకాయ, బీరకాయ, బెండకాయ, టమాట మరియు వివిధ ఆకుకూరలను సందర్శకులు ఆసక్తిగా కొనుగోలు చేశారు.
అదేవిధంగా కార్యక్రమంలో మహిళా రైతు చిన్నాల అనిత, రమేష్, అనిల్, నిర్వాహకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించడమే కాకుండా, వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇటువంటి సంతలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు

0 Comments