(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఆత్మకూరు పిఎసిఎస్ మాజీ చైర్మన్ పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు ఏరుకొండ రవీందర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన మాట్లాడుతూ ఆధిపత్య వర్గాలు తమ దోపిడి విధానాలకు సామాన్య ప్రజల సమ్మతిని రాబట్టడం కోసమే కృత్రిమంగా చాతురు వర్ణ వ్యవస్థను సృష్టించారని, అందులో దోపిడి చేసే వారికి పై స్థానాలనూ అంటగట్టి సంపద సృష్టి కర్తలైన శ్రామిక వర్గాలకూ శుద్రులు, అతి శూద్రులు అనే పేర్లు తగిలించారని అన్నారు.ఆధిపత్య వర్గాల దురాగతాలను నిరోధించడానికి శ్రామిక వర్గ ప్రజలలొ చైతన్యం తీసుకురావడానికి ఫూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సంస్థను స్థాపించాడని, నిమ్న వర్గాల ప్రజలను కుల దోపిడీ నుంచి విముక్తి చేయడంతో పాటు రైతులు కూలీలను హక్కుల కోసం సంఘటిత పరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడని అన్నారు. విద్యా విజ్ఞానం ద్వారానే తమ హక్కులను నిలబెట్టుకోగలరని గుర్తించి వారి విద్యా వ్యాప్తి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచిన మహా నాయకుడు పూలే అని అన్నారు. భారతీయ మహిళా లోకానికి మరియు దళిత వర్గాల స్త్రీలకు సైతం విద్య అందాలనే ఉద్దేశంతో వారికోసం ప్రత్యేక పాఠశాలలు నడిపిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్ కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, కిసాన్ సెల్ అధ్యక్షులు రేవూరి జయపాల్ రెడ్డి, ప్రచార కార్యదర్శి అలువాల రవి ,మూల ప్రసాద్ ,అంజలి రమేష్ ,కోల రమేష్ , కొమ్ము సరోజన, ఆత్మకూరు వీరేందర్, పాత్రికేయులు పెరుమాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments