ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలి

ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలి
(జై భారత్ వాయిస్ న్యూస్ 
ఆత్మకూరు)ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలని ఉద్యమకారుల సంఘం వరంగల్ జిల్లా నాయకుడు ఇరుసడ్ల సదానందం అన్నారు ఆత్మకూరు మండలంలోని నీరుకుల్లా గ్రామంలో ఉద్యమకారుల సంఘం కమిటీ వేసిన సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమకారులు ఉద్యమ సమయంలో అన్ని పనులు వదులుకొని ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో శ్రమ పడ్డారని అన్నారు ప్రభుత్వాలు మారుతున్న ఉద్యమకారుల కోసం ఏమి పనులు చేయడం లేదని ఆరోపించారు ఉద్యమకారుల కోసం ప్రత్యేక పింఛను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంఘం మండల ప్రధాన కార్యదర్శి బాబు మియా మండల నాయకులు పసుల లక్ష్మీనారాయణ వక్కల కుమార్, పోతరాజు రాజు, కాకాని శ్రీధర్, వంగేటి ప్రభాకర్ , వంగేటి వేణు తడక నీరజ శ్రీనివాస్ చిరంజీవి ఆర్షం మధుకర్, పసుల దామోదర్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments