పెంచికల పేట లో ఒగ్గు కళాకారుని నేత్ర దానం

పెంచికల పేట లో ఒగ్గు కళాకారుని నేత్ర దానం
(జై భారత్ వాయిస్ న్యూస్  ఆత్మకూరు)
ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట గ్రామానికి చెందిన గోవిందు కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుమారుడు సదాశయ ఫౌండేషన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు కుమారస్వామి తమ కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి నేత్రదానం చేయించారు. గోవిందు కొమురయ్య మొదటి తరం  ఒగ్గు కళాకారుడు. ఒగ్గుకథలు జనరంజకంగా చెప్పేవారు. నాడు ఎంతో మంది ఒగ్గు కథలను ఇష్టంగా చెప్పించుకునేవారు. పలు గ్రామాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కొమురయ్య  అనారోగ్యంతో మృతి చెందగా వారి కుమారుడు  తమ కుటుంబానికి నేత్రదానంపై అవగాహన కల్పించి, సదాశియ పౌండేషన్ వరంగల్ జిల్లా ఉమ్మడి కోఆర్డినేటర్ దళపతి, జిల్లా అధ్యక్షులు శంకర్ రావు  ఆధ్వర్యంలో ఎల్ వి పి టెక్నీషియన్ లక్ష్మణ్ సహకారంతో నేత్రాలు సేకరించి హైదరాబాద్ ఐ ఆస్పత్రికి పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు అందులకు చూపులు ప్రసాదించిన కొమురయ్య కుటుంబ సభ్యులు భార్య లక్ష్మి, కుమారుడు రవి కోడలు జ్యోతి, రామస్వామి మల్లమ్మ, కుమారస్వామి కవిత, కూతుర్లు అల్లుళ్ళు కోమల కొమురయ్య, లలిత కొమురయ్య కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపా రు .ఆరోగ్యంగా ఉన్నవారు అనివార్య కారణాలవల్ల మృతి చెందితే వారు నేత్రదానం చేయడం వల్ల మరో ఇద్దరికి కంటిచూపు కలుగుతుందని, మా సదాశయ ఫౌండేషన్ పదిమందికి కంటిచూపు కోసం నిత్యం పనిచేస్తుందని తెలియజేశారు. మాకు నేత్రదానానికి  సహకరించిన కొమురయ్య కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, వరంగల్ జిల్లా అధ్యక్షులు వేణుమాధవ్,, ఉపాధ్యక్షులు రాంచంద్రారెడ్డి, సంపత్, గౌరవ సలహాదారులు పురుషోత్తం, లక్ష్మారెడ్డి,శ్రీనివాస్, గ్రామస్తులు మందపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments