రహదారి నియమాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రహదారి భద్రత అవగాహన కార్యక్రమం  ఆత్మకూరు మండలంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూర్, పెదాపూర్ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద, ఆత్మకూరు మండల కేంద్రంలో సిఐ సంతోష్ ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల ను కలిసి రహదారి భద్రతపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రజలకు రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించాలని సి ఐ సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని అవగాహన కల్పించారు. వేగ పరిమితులను పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట “హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదు” అనే హెచ్చరిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకుండా పోలీస్ స్టేషన్‌లోకి అనుమతి ఇవ్వబోమని అధికారులు తెలిపారు. ప్రజలందరూ రహదారి భద్రతను తమ బాధ్యతగా భావించి నియమాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెదాపూర్ గ్రామ సర్పంచ్ రవి, ఆత్మకూరు సర్పంచ్ మహేశ్వరి రాజు, పరకాల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదాసి శ్రీధర్, రేవూరి జయపాల్ రెడ్డి, వడ్డేపల్లి ప్రసాద్, తనుగుల సందీప్, భయ్యా కుమారస్వామి, చిమ్మని దేవరాజ్, బరుపట్ల కిరీటి, కాడబోయే రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, యువకులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments