జై భారత్ వాయిస్ న్యూస్ warangal
గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గ్రామ పాలనలో విశిష్ట సేవలు అందించిన మాజీ సర్పంచ్ కూసం రాజమౌళికి జిల్లా యంత్రాంగం తరఫున సోమవారం వరంగల్ జిల్లా పరిపాలన తరఫున అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, జిల్లా పరిషత్ సీఈఓ రామ్ రెడ్డి ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. గ్రామాభివృద్ధి సుస్థిర గ్రామ పాలనలో రాజమౌళి చేసిన కృషి ఆదర్శప్రాయమని తెలిపారు. ఆయన నాయకత్వంలో గంగదేవిపల్లి గ్రామం పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యం, సమగ్ర అభివృద్ధిలో దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామంగా నిలిచిందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా యంత్రాంగం అభిప్రాయం వ్యక్తం చేశారు.

0 Comments