గంగాదేవిపల్లి జాతీయ ఆదర్శ గ్రామ నిర్మాణంలోరాజమౌళి కీలక పాత్ర మృతి తీరని లోటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
జాతీయ ఆదర్శ గ్రామం అయిన గంగాదేవి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి ఆదివారం గుండెపోటుతో మృతిచెందగా వారి భౌతిక కాయానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే .మాట్లాడుతూ గంగాదేవిపల్లి గ్రామం దేశంలోనే అత్యుత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు పొందడంలో కూసం రాజమౌళి  కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. గ్రామ అభివృద్ధి,ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.రాజమౌళి గారి మరణం తనకు వ్యక్తిగతంగా మంచి తోడును కోల్పోయినట్లుగా ఉందని, నియోజకవర్గానికి వారి మరణం తీరని లోటని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు.రాజమౌళి గారి మరణం తనకు వ్యక్తిగతంగా మంచి తోడును కోల్పోయినట్లుగా ఉందని, నియోజకవర్గానికి వారి మరణం తీరని లోటని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments