ఆత్మకూరులో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం


(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )                        రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా, టీజీ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రం లో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్, ఫారెస్ట్ అధికారి లక్ష్మణాచారి, నార్కోటిక్ డ్రగ్స్ ఎస్ఐ మోగిలి, ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎంపివో , సిఐ సంతోష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.సుమారు 100 మంది విద్యార్థులు, 20 మంది యువకులు, వార్డు సభ్యుడు సందీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Post a Comment

0 Comments