ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామం చెరువు పరిసర ప్రాంతాల్లో కాకతీయులకు పూర్వం సిద్ధులు నివసించిన ప్రాంతం. చెరువు సమీపంలో దాదాపు నూరు దేవాలయాలు ఉండేవని అక్కడ సిద్ధులు తపస్సు చేసేవారని బట్టి అక్కడక్కడ లభించిన శిల్పాలను బట్టి తెలుస్తున్నది నూరు దేవాలయాలు ఉండడం వల్ల గ్రామస్తుల అక్కడ నివసించడంతో నీరుకుల్లగా మారిందని స్థానికులు చెబుతారు. వాతావరణ మార్పులను బట్టి నూరు దేవాలయాలు శిధిలం కాగా అక్కడక్కడ మిగిలిన దేవాలయాలు మచ్చుకు కొన్ని దర్శనమిస్తున్నాయి. రోడ్డు ఇరువైపులా దేవాలయం ఆనవాళ్లు ఉండడంతో ఒక దేవాలయం శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం గా రూపు దిద్దుకున్నది.
కొన్ని వందల ఏళ్లుగా రోడ్డు పక్కన శిథిలమైన దేవాలయం ఉండగా గ్రామస్తులు చూడ లేదు. అక్కడ లోపల బ్రహ్మ సూత్రం వున్న సిద్ధ లింగేశ్వ రుడు దర్శనమిస్తున్నాడు. గత రెండు సంవత్సరాల క్రితం మహాశివరాత్రి రోజున అక్కడ గ్రామస్తులు శ్రీ సిద్ధ లింగేశ్వరుని బయటికి తీసి ఆరు బయట పూజలు చేయడం ప్రారంభించారు కోరి నా కోర్కెలు వీడేరిన భక్తులు శ్రీ సిద్ధ లింగేశ్వరునికి తాత్కాలికంగా షెడ్డు వేసి నిత్యము పూజలు చేస్తున్నారు పలు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినా భక్తులు శ్రీ సిద్ధలింగేశ్వరుని సేవిస్తూ ఉండడంతో గ్రామస్తులందరూ ఏకమై దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. భూమి పూజ అనంతరం భక్తులు అందించిన విరాళాలతో దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు
శ్రీ సిద్ది లింగేశ్వర ఆలయం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి
ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామ శివారులోని చెరువు పరిసర ప్రాంతాలలో నెలకొన్న శ్రీ సిద్ధి లింగేశ్వర ఆలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ వెన్నపురెడ్డి రాజిరెడ్డి వైస్ చైర్మన్ తాటిపర్తి మోహన్ రావు, మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్ లు కోరారు. సోమవారం ఆలయ పనులను చేయిస్తున్న సందర్భంగా కాకతీయులకు పూర్వము నీరుకుల్లా గ్రామ శివారులో 100 దేవాలయాలు ఉండేవని అక్కడ సిద్ధులు తపస్సులు చేసేవారని తరతరాల నుంచి తెలిసిందని అన్నారు ఈ నేపథ్యంలో సిద్ధులు తపస్సు చేసిన ఆనవాలు తో ఇక్కడ లభ్యం అయిందని అన్నారు. శ్రీ సిద్దలింగేశ్వరుడు మహాశివరాత్రి రోజున బయటికి కనపడడంతో తీయడం జరిగిందని తెలిపారు గ్రామస్తులందరూ ఏకమై శ్రీ సిద్దలింగేశ్వర ఆలయ నిర్మాణానికి పూనుకున్నారని వివరించారు ఈ సందర్భంగా కడారి నవనీత్ రావు రఘునాధరావు లు భూమి కొనుగోలుకు విరాళాలు ఇచ్చారని చెప్పారు అలాగే తాటిపర్తి కిషన్ రావు విరాళం ఇవ్వడంతో దేవాలయ నిర్మాణం ప్రారంభించడం
జరిగిందని చెప్పారు భూమి పూజ అనంతరం దేవాలయ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామని వారు వివరించారు బొంపల్లి పుల్లారావు రూ. లక్ష 1116 లు విరాళం అందించారని దేవాలయ నిర్మాణము చురుకుగా పనులు సాగుతున్నాయని వారు వివరించారు శ్రీ సిద్ధి లింగేశ్వర ఆలయ లో దేవ దేవుని కోరిన కోరికలు నెరవేరిన భక్తులు విరాళాలు అందిస్తున్నారని వారు వివరించారు
దేవాలయ నిర్మాణానికి విరాళాలు అందించి భాగస్వాములు కావాలని వారు కోరారు
0 Comments