జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ట్రేడ్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించి వసూళ్లు చేపట్టాల్సిన అవసరం ఉందని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి శానిటేషన్ అధికారులను ఆదేశించారు.గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ ఛాంబర్ లో ట్రేడ్ వసూళ్ల తీరు, పురోగతి పై శానిటేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మేయర్ పాల్గొని సమర్థవంతం గా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ సానిటరీ ఇన్స్పెక్టర్ లు ట్రేడ్ వసూళ్లను పెంచాలని, ఆయా డివిజన్ లలో ట్రేడ్ వసూళ్ల కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని అందుకు అనుగుణం గా ఒక మాసం లోనే వసూళ్లు చేసేలా చూడాలని అన్నారు. ,సానిటరీ ఇన్స్పెక్టర్ లు వారి పరిధి లోని జవాన్ లతో మానిటరింగ్ చేసుకుంటూ రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైన్ లను క్లీన్ లను చేసుకొనే విధం గా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని పక్కా గా జరిగేలా చూడాలని, ఈ కార్యక్రమాలకు కొనసాగిస్తూ యధావిధిగా నిరంతరం జరిగే శానిటేషన్ ప్రక్రియ కొనసాగేలా చూడాలని తెలిపారు. గ్యాంగ్ వర్క్ లు నిర్వహించే క్రమం లో ఎన్ని గృహాలు ఉన్నాయో వాటికి అనుగుణం గా చేపట్టాలని అన్నారు.అర్బన్ మలేరియా విభాగానికి సంబంధించి ప్రతి డివిజన్ లలో వారి కార్యకలాపాలకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితం గా డివిజన్ లలో ఫాగింగ్, స్ప్రేయింగ్ తో పాటు ఇంటింటి సర్వే చేపట్టాలని, ఇందుకోసం వినియోగించే పరికరాలు/ పనిముట్ల పని విధానం సరిగా ఉందో లేదో నిర్ధారించుకుంటు అన్ని రకాల ఫాగింగ్ జరపాలని, ఇందుకోసం నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకొని అమలు చేయాలని ఈ సందర్భం గా మేయర్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఎం హెచ్ ఓ డా.రాజేష్ సానిటరీ సూపర్ వైజర్ లు భాస్కర్ గోల్కొండ శ్రీనివాస్ నరేందర్ సూపరిండెంట్ దేవేందర్ తో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ లు హెల్త్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments