నీరుకుళ్ళలో వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ );
ఆత్మకూరు మండలం  నీరుకుల్ల విశ్వబ్రాహ్మణ సంఘం లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల  ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని సంఘ అధ్యక్ష కార్యదర్శులు పొనుకోటి.సత్యనారాయణ,ఉప్పునూతల. కోటిలింగాచారిలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.బ్రహ్మంగారు కాలజ్ఞాన  బోధించిన తత్వాలను పురోహితులు ఉప్పునూతల బ్రహ్మచారి గురుసాయి ఆచార్యులు బోధింఛారు . బ్రహ్మంగారు జీవ సమాధి అయి నేటికీ 333 వసంతాలు అయినందున  బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతున్నదని చెప్పారు. అలాగే పూజ అనంతరం పొనుగోటి ఉమా ప్రభాకర్ చారి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఉప్పునూతల.నరసింహమూర్తి, అన్నమాచారి హరీష్ రాము పోనుగోటి శ్రీనివాస్ రాంబ్రహ్మం, రాజశేఖర్, షణ్ముఖచారి, వీరాచారి, సలేంద్ర రామాచారి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు

Post a Comment

0 Comments