శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మంగారి 333వ ఆరాధనోత్సవాలు
కడప జిల్లాలోని కందిమల్లాయపల్లె ఏప్రిల్ 23 నుండి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా గీసుకొండ
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో ఆదివారం ఆరాధనోత్సవాలు జరుగుతాయని దేవాలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మశ్రీ బెజ్జంకి బిక్షపతి దైవజ్ఞ తెలియజేసారు
కాలజ్ఞాన కర్త, దైవాంశ సంభూతులు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో.శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవ మహోత్సవం స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి, ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు
దేవాలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మశ్రీ బెజ్జంకి బిక్షపతి దైవజ్ఞ తెలియజేసారుఆలయంలోఉదయం. ఆరు గంటలకు పంచామృతాలు,ఫల పుష్పాలతో స్వామివారికి మహాభిషేకం,ఉదయం ఏడు గంటలకు పవిత్ర జెండా ఆవిష్కరణ ఉదయం ఏడుగంటల మూప్పై నిముషములకు స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, ఉదయం తొమ్మిది గంటలకు భక్తి పూర్వక వీరగురు భజన ఉదయం. తొమ్మిది గంటల మూప్పై నిమిషా|లకు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రధాన ఆరాధన, మధ్యాహ్నం 12:00 గంటలకు గురుపూజ మధ్యాహ్నాం 12:30 నిమిషాలకు మహా ఆశీర్వచనంమధ్యాహ్నం 1:00 గంటలకు స్వామివారికి మంగళహారతి, మధ్యాహ్నం 1:30 నిముషాలకు భక్తజనులకు తీర్థ ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని చెప్పారు.
0 Comments