Jaibharathvoicenews kuc
కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకొని ఫిట్ ఇండియా/ఒబెసిట్ ఫ్రీ ఇండియా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నుండి మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మిషన్ హెల్త్ భారత్ వ్యవస్థాపకురాలు, పానీపూరి వాలిగా ప్రసిద్ది చెందినా తాప్సి ఉపాధ్యాయ (ప్రజల్లో బీటెక్ ప్రసిద్ధి )ను శాలువా, జ్ఞాపికతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె చేపట్టిన “మిషన్ హెల్త్ భారత్” యాత్రను వైస్ చాన్సలర్ ప్రశంసించారు. భారతదేశంలో పెరుగుతున్న స్థూలకాయం సమస్యను తగ్గించాలనే లక్ష్యంతో తాప్సి ఉపాధ్యాయ గత నాలుగు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రెండు చక్రాల వాహనంపై ప్రయాణిస్తూ ఇప్పటివరకు దేశంలోని 112 నగరాల్లో 220కు పైగా కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు ఒక లక్షకు పైగా యువతలో ఆరోగ్యకర జీవన విధానం, వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లు, నివారణ చర్యలపై అవగాహన కల్పించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా యువతలో “Obesity Mukth Generation Yoddha (OMG)” అనే భావనతో స్థూలకాయం రహిత సమాజ నిర్మాణం కోసం చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆరోగ్యంపై చైతన్యాన్ని పెంపొందించి, ఆరోగ్యవంతమైన భారత నిర్మాణానికి దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాప్సి ఉపాధ్యాయతో కలిసి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులను కూడా వైస్ చాన్సలర్ అభినందించారు. ఈకార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం పాల్గొన్నారు.
0 Comments