పది పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞల అమలు సీఐ ఆర్ సంతోష్


 (జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ ) ఆత్మకూరు  మండలం లో 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఆత్మకూరు సిఐ ఆర్ సంతోష్  తెలిపారు. శుక్రవారం ఆయన ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా *సెక్షన్ 163 బి ఎన్ఎస్ఎస్  (144 సెక్షన్)* అమలు చేయనున్నట్లు తెలిపారు. శని వారం  నుంచి ఏప్రిల్ 16  వరకు  ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగు తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని చెప్పారు.పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు శనివారం నుంచి ఏప్రిల్ 16   వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని సీఐ చెప్పారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన  చర్యలు తీసు కుంటామని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments