తిరుమలగిరి లో ఉచిత కంటి వైద్య శిబిరం

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )
   సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని   కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని  తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ పరకాల నియోజకవర్గం అధ్యక్షులు-మాజీ పాక్స్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్  బూర దేవేంద్ర రాజేందర్  అన్నారు.  ఆత్మకూరు తిరుమలగిరి గ్రామ సర్పంచ్  ఆధ్వర్యంలో  వాసన్ ఐ కేర్ సిబ్బంది ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏరుకొండ రవీందర్  మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ  శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి  కుడా చైర్మన్ డీసీసీ అధ్యక్షులు ఇనిగాల వెంకటరమణారెడ్డి  సహకారంతో సేవా కార్యక్రమాల్లో భాగంగా తిరుమలగిరి గ్రామ ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.
 వాసన్ ఐ కేర్ హాస్పిటల్ హనుమకొండ వారికీ కృతజ్ఞతలు తెలిపారు. మానవ శరీరంలో అతి ముఖ్యమైనది కంటి చూపు సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు  వృద్ధులు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  బూర దేవేంద్ర రాజేందర్  మాట్లాడుతూ వృద్ధులు,విద్యార్థులు కంటి చూపుపై అశ్రద్ధ చేయవద్దన్నారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్  క్యాంపు ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఓపి చూడడమే కాకుండా కంటి అద్దాలపై రాయితీ ఇస్తూ ఉచిత కంటి శస్త్ర చికిత్సలను చేశారని చెప్పారు. వారిని నిజంగా అభినందించాల్సిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో బొచ్చు చందర్ తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు, పరికిరాల వాసు, అలవాల రవి, చందర్ వాసన్  ఐకేర్ సిబ్బంది అనిశెట్టి చేతన్ కుమార్, వినయ్, లావణ్య పాల్గొన్నారు.

Post a Comment

0 Comments