క్రీడల తోనే విద్యార్థులకు స్వీయ క్రమశిక్షణ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు న్యూస్ )
గ్రామీణ విద్యార్థులను ప్రగతి బాటలో నడిపేందుకు క్రీడలతోనే స్వీయ క్రమ శిక్షణ అలవడుతుందని ఆత్మకూరు అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కప్ ముగింపు కార్యక్రమం లో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేసి స్వీయ క్రమశిక్షణ మైదానంలో అలవర్చుకునే విధంగా జీవన సమతుల్యతను నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఉపకరిస్తా యని అన్నారు.క్రీడా స్ఫూర్తిని విద్యార్థుల్లో కల్గించేలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వంచే సీఎం కప్ క్రీడోత్సవాల జరుగుతున్నాయని అన్నారు జడ్పీహెచ్ఎస్ ఆత్మకూరు క్రీడాస్థలంలో అంగరంగ వైభవంగా జరిగిన పలు క్రీడల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు సీఎం కప్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్వతనేని మహేశ్వరి, ఎమ్మార్వో జగన్మోహన్ రెడ్డి, ఎస్సై చారీ, కన్వీనర్ మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి ఎస్జీఎఫ్ ఐ సెక్రటరీ రజిత శంకర్ సురేష్ శ్రీలక్ష్మి సుమలత మరియు విద్యార్థులు పుర ప్రముఖులు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.
0 Comments