కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మోసగాళ్లు

(జై భారత్  వాయిస్ న్యూస్)
గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పీడకలని, అడుగడుగునా కల్తీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లాగా జగన్ "కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు" (KRB) అనే వ్యవస్థను స్థాపించి దానికి ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారని ఆమె ఎద్దేవా చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జనాభాకు కల్తీ మందులు సరఫరా చేయడంతో మొదలై.. కల్తీ లిక్కర్, చివరకు సామాన్య ఇసుకలో సముద్రపు ఇసుక కలిపి విక్రయించే స్థాయికి జగన్ పాలన దిగజారిపోయింది. చివరకు విద్యా వ్యవస్థను, పరీక్షా విధానాలను కూడా కల్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. ఆ మనిషే ఒక కల్తీ, ఆయన పాలనే ఒక కల్తీ అని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అయిన తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం మహా పాపానికి ఒడిగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ జరగలేదని బుకాయిస్తున్న వైకాపా నాయకులకు ఆమె నాలుగు కీలక నివేదికలను సవాల్‌గా విసిరారు. 2022లోనే వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడు నెయ్యిలో పామాయిల్ కల్తీ జరిగిందని CFTRI (మైసూర్) రిపోర్ట్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ NDDB నివేదిక ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలింది. ప్రసాదానికి వాడిన పదార్థం నెయ్యి కాదు, రసాయనాల ముద్దని NDRI రిపోర్ట్ నిర్ధారించింది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సిట్ (SIT) కూడా కల్తీని ధ్రువీకరించింది. ఇంత ఘోరం జరిగినా వైకాపా నేతలు ఎక్కడా క్షమాపణలు చెప్పకపోగా, ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, అసలు కల్తీ జరగలేదని నిరూపించడానికి వైకాపా దగ్గర ఒక్కటంటే ఒక్క అథెంటిక్ రిపోర్ట్ ఉందా? అని ఆమె ప్రశ్నించారు. తాడేపల్లి కొంపలో తయారయ్యే 'సాక్షి' పేపర్లో వచ్చే రాతలే రిపోర్టులు అనుకుని మాట్లాడటం వారి అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కల్తీ జరిగిందని నిర్ధారిస్తూ మా దగ్గర CFTRI, NDDB, NDRI మరియు సిట్ (SIT) ఇచ్చిన నాలుగు అధికారిక నివేదికలు ఉన్నాయి. మరి కల్తీ జరగలేదని చెప్పడానికి వైకాపా దగ్గర ఒక్క అథెంటిక్ రిపోర్ట్ అయినా ఉందా? తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే 'సాక్షి' పేపర్లో వచ్చే రాతలే మీకు నివేదికలా? అని ఆమె ప్రశ్నించారు. హిందూ ధర్మంలో తిరుమల ప్రసాదానికి ఉన్న పవిత్రత జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియదు. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని, అత్యంత భక్తితో ఇంటికి తీసుకెళ్లి పూజ గదిలో పెడతారు. అటువంటి పవిత్రమైన ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లకు వాడే లబ్సా (LABSA) వంటి కెమికల్స్‌ను, పామాయిల్‌ను, జంతువుల కొవ్వును కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారా? వైకాపా హయాంలో వాడిన నెయ్యిలో 60 లక్షల కిలోల పామాయిల్, ఎసిటిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ ఉన్నట్లు తేలింది. 254 కోట్ల స్కామ్ వెనుక వైవీ సుబ్బారెడ్డి పీఏ హస్తం ఉందని, 4.50 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయని సిట్ నివేదికలు చెబుతుంటే సమాధానం చెప్పకుండా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. బాబాయ్ హత్య కేసులో ఏ రకంగా అయితే ప్రజల మైండ్ మార్చడానికి ప్రయత్నించారో, ఇప్పుడు సిట్ రిపోర్ట్ రాకముందే "జంతు కొవ్వు లేదు" అంటూ వైకాపా రాక్షస మూక ప్రచారం మొదలుపెట్టింది. కానీ ప్రజలు మీకంటే తెలివైన వారు, మీ అబద్ధాలను నమ్మే పరిస్థితిలో లేరు. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ మహాపాపం బయటపడాలని ఆ దేవుడే అనుకున్నారేమో. అందుకే ఇన్నాళ్లకు ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయోధ్య రామాలయానికి కూడా ఈ కల్తీ లడ్డూలనే పంపడం సనాతన ధర్మానికి జరిగిన ఘోరమైన అపచారం. ఈ మహాపాపానికి ఒడిగట్టిన వారిని ప్రజలు మనుషులుగా చూసే పరిస్థితి లేదు. తప్పు చేసిన వారు బయటకు వచ్చి పశ్చాత్తాపం ప్రకటించాల్సింది పోయి, తిరిగి సీఎం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారిపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఇటువంటి వారిని రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం పెట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది.తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కొనుగోలు ప్రక్రియలో గత వైకాపా ప్రభుత్వం చేసిన భారీ కుంభకోణాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. కేవలం తమ జేబులు నింపుకోవడానికి టెండర్ నిబంధనలను ఎలా తుంగలో తొక్కారో ఆమె వివరించారు. నెయ్యి రావాలంటే పాలు ఉండాలి. కానీ వైకాపా హయాంలో అసలు పాలతో సంబంధం లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు ఉండాలనే నిబంధనను తొలగించారు. 3 ఏళ్ల అనుభవం ఉండాలనే కండిషన్‌ను కేవలం ఒకే ఏడాదికి తగ్గించారు. టర్నోవర్ పరిమితిని రూ. 250 కోట్ల నుండి రూ. 150 కోట్లకు తగ్గించడమే కాకుండా, చివరకు FSSAI సర్టిఫికేషన్ ఉండాలనే నిబంధనను కూడా పక్కన పెట్టారు. ఇదంతా ఎవరిని మోసం చేయడానికి? ఎవరి జేబులు నింపడానికి? అని ఆమె ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా పాలు ఉంటేనే నెయ్యి వస్తుంది. కానీ తాడేపల్లిలో కొత్తగా 'పామాయిల్ ఫార్ములా' కనిపెట్టినట్లున్నారు. 2022లో 'బీటా సిస్టోస్టిరోల్' అనే తప్పనిసరి పరీక్షను కూడా ఉద్దేశపూర్వకంగానే సడలించారు. ఈ అక్రమాలకు పాల్పడిన అప్పటి అధికారులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నిన్నటి వరకు కల్తీ జరగలేదని బుకాయించిన వైవీ సుబ్బారెడ్డి, ఈరోజు మాట మార్చి "నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది, పామాయిల్ కలిసింది" అనిఒప్పుకుంటున్నారు. అధికారులు, థర్డ్ పార్టీ వ్యక్తులు చేశారని నిందలు వేస్తున్నారు. పర్చేస్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మీ సిగ్నేచర్ లేకుండా ఇవన్నీ ఎలా జరిగాయి? 2022లోనే రిపోర్ట్ వచ్చినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని నిలదీశారు. వెంకటేశ్వర స్వామి అంటే వైకాపా నేతలకు ఎందుకంత కోపం? పవిత్రమైన ప్రసాదాన్ని రసాయనాల ముద్దగా మార్చి భక్తుల ప్రాణాలతో, మనోభావాలతో ఆడుకున్నారు. జగన్ గారికి హైందవ సంప్రదాయం గురించి తెలియదు కాబట్టే అయోధ్య రామాలయానికి కూడా కల్తీ లడ్డూలు పంపి మహాపచారానికి ఒడిగట్టారు. ఎక్కడైనా కల్తీ వస్తువులు దొరికితే కేసు ఓనర్‌పైనే పెడతారు తప్ప వర్కర్ మీద కాదు. మరి కొన్ని వేల కోట్ల రూపాయల భక్తుల సొమ్ముతో నడిచే టీటీడీలో, పర్చేస్ కమిటీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి గారికి ఈ కల్తీలో బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి గారే స్వయంగా తన పీఏ చార్జ్‌షీట్‌లో ఉన్నారని, థర్డ్ పార్టీ వ్యక్తులు ఉన్నారని ఒప్పుకుంటున్నారు. మరి ప్రధాన బాధ్యుడు చైర్మన్ కాదా?రూ. 254 కోట్ల స్కామ్ రిపోర్టులో స్పష్టంగా కనిపిస్తుంటే సమాధానం చెప్పడం మానేసి వైకాపా డ్రామాలు ఆడుతోంది.అయోధ్య రామాలయానికి కూడా ఈ కల్తీ లడ్డూలనే పంపడం ద్వారా వైకాపా ప్రభుత్వం మహాపచారానికి ఒడిగట్టింది. గత ఐదేళ్లలో భక్తులు, నేతలు, పారిశ్రామికవేత్తలు తిన్నది ప్రసాదం కాదు.. అది పామాయిల్, రసాయనాలతో తయారు చేసిన రసాయనాల ముద్ద. దీనికి వైకాపా నేతలు ఎలా సమాధానం చెబుతారు? తమ పాపాలు బయటపడతాయని తెలిసి, ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి వైకాపా నేతలు 'పరామర్శ యాత్రలు' పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. అంబులెన్స్‌లు ఆగిపోయి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత జగన్ మోహన్ రెడ్డిదే అని ఆమె స్పష్టం చేశారు. "హోం మంత్రిగా నేను ఒకటే చెబుతున్నా.. మీకు మీటింగ్ పెట్టుకోవాలని ఉంటే పర్మిషన్ తీసుకోండి. 5 వేల మంది కాదు 50 వేల మందితో పెట్టుకోండి, మేమే బందోబస్తు ఇస్తాం. మేమేమీ మీలాగా మైకులు లాక్కోము, హౌస్ అరెస్టులు చేయము. పర్మిషన్ లేకుండా వచ్చి, పోలీసులను తోస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తిరిగి పోలీసులనే అడ్డుకుంటున్నారని నిందలు వేయడం సబబు కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ప్రజలను ఇబ్బంది పెడితే కేసులు తప్పవన్నారు. రాజకీయాల కోసం మేము తప్పుడు ఆధారాలు సృష్టించాల్సిన అవసరం లేదు. దైవద్రోహానికి పాల్పడ్డారు కాబట్టే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించి తగిన బుద్ధి చెప్పారు.  మనం ఐదేళ్ల పాటు ఇలాంటి కల్తీ మనుషులను భరించాం. రాజకీయాలు పక్కన పెడితే, మన మనోభావాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. అబద్ధాలు చెప్పే రాక్షస మూకల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దేవుడితో పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదు, వైకాపాకు ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తాడన్నారు.

Post a Comment

0 Comments