(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శుక్రవారం గౌరీ లక్ష్మీ దేవతల ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. గణపతి కి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు గణపతికి నైవేద్యాలతో తరలివచ్చి గణనాధుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పురోహితులు వైద్య మనోజ్ మంగళ గౌరీ లక్ష్మీ పూజ కుంకుమార్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. అనంతరం గణపతి మండపం వద్ద దాత పాపని రాజు దంపతులు మహాన్న ధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొంపెల్లి రవీందర్ కందకట్ల కుమారస్వామి వెల్ది కపిల్, కొంపెల్లి మణికుమార్ మార్త రంజిత్ వెల్దే గణేష్ దాసరి శశాంక్ కృష్ణమూర్తి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
0 Comments