ప్రతి విద్యార్థికి ట్రాక్ రికార్డు తప్పనిసరిగా ఉండాలి.-ఖానాపూర్ ఎంఈఓ వెంకట్రామ్

(జై భారత్ వాయిస్ వరంగల్ ):
ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థి ట్రాక్ రికార్డు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల విద్యాశాఖ అధికారి బానోతు వెంకట్రాం అన్నారు శుక్రవారం  మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల, బండమీది మామిడి తండా ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఎఫ్ ఎల్ ఎన్ కు సంబంధించిన రికార్డులను పూర్తిగా పరిశీలించారు. అనంతరం వంటశాల పరిశుభ్రత ను పరిశీలించి   మధ్యాహ్న భోజనం, పోషక పదార్థాలను అందిస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజనం పదార్థాలను ఉందని తనిఖీ చేసి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బానోత్ వెంకట్రాం  మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఎఫ్ఎల్ఎన్ ను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. తరగతిస్థాయి సామర్థ్యాలు విద్యార్థులు సాధించడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర వహించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో నీ తరగతి గదులలో టిఎల్ఎం ప్రదర్శించాలని అన్నారు. పాఠశాలలో లైబ్రరీ పీరియడ్ ను కచ్చితంగా మైంటైన్ చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో ఎఫ్ఎల్ ఎన్ రికార్డులు ఎఫ్ ఏ రికార్డులు అందుబాటులో ఉంచాలని అన్నారు. రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి మానిటరింగ్ బృందాలు, ఖానాపురం మండలం లోని పాఠశాలలను సందర్శించనున్నాయని ఆయన పేర్కొన్నారు. టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకుని బోధించాలని అన్నారు. పాఠశాలల్లో  విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా అందించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజన వివరాలను అందుబాటులో ఆన్లైన్లో ఎంటర్ చేసి విధిగా ఉంచాలని కోరారు. ఈ సందర్భంగా మనుబోతుల గడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాగ్య ,వీరన్న ,అశోకు , వెంకటేశ్వర్లు, ఐ ఈ డి ఆర్ పి మహేందర్, బండమీది మామిడి  తండా ఉపాధ్యాయుడు అర్జ  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments