(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
రైతుల సౌకర్యార్థం మీ సేవలో ఎరువుల బుకింగ్ కోసం FFS సేవను సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి పొనుగోటి యాదగిరి రైతులను కోరారు. రైతులకు ఎరువుల కొనుగోలులో మరింత సౌకర్యం కల్పించేందుకు “Framework for Fertilizer Sale (FFS)” సేవను ప్రస్తుతం మీ సేవ (MeeSeva) కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు ఎరువుల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోలేని లేదా స్లాట్ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఈ FFS సేవను మీ సేవ కేంద్రాల ద్వారా వినియోగించుకోవచ్చునని తెలిపారు..కావున ఎరువుల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోలేని రైతులు సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి FFS సేవను వినియోగించుకోవాలని కోరారు.రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని ఎరువుల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను సులభతరం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
0 Comments