జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
హనుమకొండ భవానినగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల మహిళా డెయిరీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు,పరకాల మహిళా డైరీ సభ్యులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.పరకాల మహిళా డెయిరీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వివరించారు.పాల సేకరణను పెంచడం, పాడి పశువుల నాణ్యతను మెరుగుపరచడం, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, పశువుల దాణా–పచ్చిమేత అందుబాటులోకి తీసుకురావడం, కృత్రిమ గర్భధారణ, మహిళా రైతులకు శిక్షణ వంటి వివిధ అంశాలపై ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధుల వివరాలను తెలిపారు.పరకాల మహిళా డెయిరీ అభివృద్ధిలో కీలక ముందడుగుగా జాతీయ పాలాభివృద్ధి మండలి (NDDB)తో ఐదేళ్ల భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం కుదిరిందని అన్నారు.పాడి రైతులకు వారి శ్రమకు తగిన న్యాయమైన ధర లభించేలా చూడటంతో పాటు, పాల ఉత్పత్తిదారులు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.ప్రభుత్వ సహకారంతో అధికారుల కృషితో, రాజకీయాలకు అతీతంగా పరకాల డైరీనీ అభివృద్ధి చేసుకుందాం అని,ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.
0 Comments